నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కాశ్మీర్ మాజీ సీఎం అయిన ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల గోల్ మాల్ విషయంలో ఫరూక్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణ శ్రీనగర్ లోనే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో 113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫరూక్ అబ్దులాను రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనందుకే ఆయనను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్ధలను బీజేపీ ఉసిగొలుపుతుంది అని నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నించిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఈ కామెంట్స్ చేసింది. అయితే జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్ గా ఫరూక్ ఉన్న సమయంలో 43 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీని పై ఫరూక్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. అయితే ఈ విషయం పై స్పందించిన ఫరూక్ కుమారుడు బీజేపీ కావాలనే ఇందులో తన తండ్రిని ఇరికిస్తుంది అని ఆరోపించాడు.
previous post
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి