telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నా పై జరిగిన దాడి ఘటన పై విచారణ జరపండి: మంత్రి పుష్పశ్రీవాణి

pushpa sreevani

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 11న కురుపాంలో తనపై దాడి జరిగితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలని జిల్లా పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.ఈరోజు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలో పర్యటించారు.

బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతులు, బాధితుల కుటుంబాలను శ్రీవాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో మరణించిన ఇద్దరు కార్మికులకు ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెరో రూ.15 లక్షలు నష్టపరిహారం అందించేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. పార్వతీపురాన్ని జిల్లాగా చేయాలన్న స్థానికుల డిమాండ్ ను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతానని శ్రీవాణి హామీ ఇచ్చారు. 

Related posts