తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ హవా చాటుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లోనే ఉండి ఫలితాల సరళిని తెలుసుకుంటున్నారు.