telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

పిల్లలలో… రోగనిరోధక శక్తికి… ఇలా..

immunity boosting tips in kids

వాతావరణ మార్పులకు పెద్దలే అల్లాడిపోతుంటారు.. మరి పిల్లల సంగతి చెప్పాల్సిన పనేలేదు. అందుకే పిల్లల కోసం ప్రత్యేక ముందస్తు జాగర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పెద్ద‌ల క‌న్నా చిన్న పిల్ల‌ల‌కే వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్ర‌త త‌క్కువ‌గా పాటిస్తారు. స్కూల్‌లోనూ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌ల‌సి తిరుగుతారు క‌నుక వారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే పిల్ల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వారిలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాలి. తద్వారా ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి దూరంగా ఉండవచ్చు. అవేమిటో కొన్ని చూద్దాం..

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం

పిల్ల‌ల‌కు నిత్యం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ స‌మ‌తూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

నిద్ర

పిల్ల‌ల‌న్నాక నిద్ర‌పోకుండా మారాం చేయ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రు పిల్ల‌లైతే అర్థ‌రాత్రి వ‌ర‌కు గేమ్స్ ఆడుతూ కాల‌క్షేపం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు ఇలాంటి పిల్ల‌ల‌ను త్వ‌ర‌గా ప‌డుకోబెట్టాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్ల‌కు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర త‌గినంత‌గా ఉంటే పిల్ల‌ల్లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

శుభ్ర‌త 

ఆహారం తినేముందు, తిన్నాక చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని పిల్ల‌ల‌కు చెప్పాలి. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు ఆ అల‌వాటు చేయించాలి. ఆట‌లు ఆడుకున్నాక, కుక్క‌లు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్నాక చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోమ‌ని చెప్పాలి. ఎందుకంటే పిల్ల‌ల‌కు వ‌చ్చే వ్యాధులలో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గ‌డ‌ప‌డం వ‌ల్ల‌, పెంపుడు జంతువుల‌ను ముట్టుకోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. క‌నుక ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాలి.

ఆయుర్వేదం 

పిల్ల‌ల‌కు గుడుచి, అమ‌లాకి (ఉసిరి), య‌ష్టిమ‌ధు, గుగ్గుళ్లు త‌దిత‌ర ఆయుర్వేద మూలిక‌ల‌ను నిత్యం ఇవ్వాలి. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు వీటిని పిల్ల‌ల‌కు ఇస్తుంటే పిల్ల‌ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది.

Related posts