telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఈ నెల కూడా గ్యాస్ సిలిండర్ ధరలు… సామాన్యుడికి ఊరట

Gas

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర వరుసగా మూడు నెలలుగా నిలకడగానే ఉంటూ వస్తోంది. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నెల కూడా గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ధరలను స్థిరంగానే కొనసాగించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.594 వద్ద ఉంది. గత నెలలో కూడా ఇదే ధర ఉంది. అయితే ఈ నెలలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం పెరిగింది. ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.32 పెరుగుదలతో రూ.1133 నుంచి రూ.1166కు చేరింది. కోల్‌కతాలో కూడా 19 కేజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.24 పెరుగుదలతో రూ.1220కు చేరింది. ముంబైలో కూడా రూ.24 పెరుగుదలతో ఈ సిలిండర్ ధర రూ. 1113కు ఎగసింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ.26 పెరుగుదలతో రూ.1276కు చేరింది. ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి సబ్సిడీ కింద 12 సిలిండర్లు పొందొచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది ఈ నెలలో గ్యాస్ సిలిండర్ పెరుగుతుందని భావించారు. అయితే ఇప్పుడు ఈ నెల కూడా గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగడం గమనార్హం.

Related posts