telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అంధాదున్” రీమేక్ కోసం లొకేషన్ల వేటలో టీం

Nithin

యంగ్ హీరో నితిన్ బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాదున్’ను రీమేక్‌లో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లొకేషన్ల వేట కొనసాగిస్తున్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్‌లో కలిసి ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సినిమాను నితిన్ తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సోదరి నికితారెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగులు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్‌లకు పర్మిషన్స్‌ ఇవ్వడంతో స్టార్స్‌ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో సందడి నెలకొంది. ఈ కోవలో హీరో నితిన్‌ ‘రంగ్‌దే’ షూటింగ్ నిమిత్తం యూనిట్‌తో కలిసి ఇటలీకి వెళ్లేందుకు సిద్దమయ్యాడు.

Related posts