telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గల్లీలో నుంచి దిల్లీ చేరిన వ‌రి పోరు..నేడు దిల్లీలో కేసీఆర్ రైతు దీక్ష‌

ధాన్యం పోరు గల్లీ నుంచి దిల్లీకి చేరింది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. ఇప్పుడు మరింత ఒత్తిడి పెంచేందుకు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది..

తెలంగాణలో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుంది.

తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణ రైతుల పక్షాన హస్తినలో ప్రజా ప్రతినిధులు దీక్షకు పూనుకున్నారు.. వడ్లను అడ్డుపెట్టుకొని అడ్డమైన రాజకీయాలకు చేసేందుకు బీజేపీని ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్‌ మండిపడుతోంది..

ఈ పోరు దీక్షలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నేతలు పాల్గొననున్నారు. ఈ దీక్షలో 1500 మందిప్రజాప్రతినిధులు, నాయకులు  స్టేజ్‌పై కూర్చునేలా భారీగా ఏర్పాట్లు చేశారు.  దీంతో పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు.

మ‌రోవైపు ఎండత తీవ్రత దృష్ట్యా.. దీక్షా స్థలి వద్ద కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు.. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం ఏర్పాట్లు కూడా చేశారు..

Related posts