చట్టం ప్రకారం ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. న్కూఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణకు హక్కుగా రావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు కేటీర్ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 2.70 లక్షల కోట్ల పన్ను ఆదాయంగా చెల్లించామనీ, కేంద్రం మాత్రం రాష్ర్టానికి తిరిగి రూ. లక్షా 15 వేల కోట్లేనని మంత్రి వివరణ ఇచ్చారు.
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆదాయానికి, రాష్ట్రానికి ఇచ్చిన ఆదాయానికి దాదాపు రూ. లక్షా 60వేల కోట్ల వ్యత్యాసం ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ మనుగడ దెబ్బతినక తప్పదని మంత్రి సూచించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
పవన్ కు విజన్ లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు: మంత్రి వెల్లంపల్లి