telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలి: పవన్ కల్యాణ్

pawan

ప్రధాని మోదీ 70 వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన  అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

మన దేశంలో ఎంతో మంది వ్యక్తులకు ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం లభిస్తుందని కానీ, కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. దేశభక్తి,, సేవాతత్పరత ఉన్నవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. అలాంటి గొప్ప నాయకులలో మోదీ అగ్రస్థానంలో ఉంటారని కితాబిచ్చారు. బాల్యదశలోనే సామాజికసేవకు ఆకర్షితులైన మోదీ.. ఆ సేవను నిర్విరామంగా కొనసాగిస్తూ ఒక దృఢమైన నాయకుడిగా రూపుదిద్దుకున్నారని అన్నారు.

ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, ఆయన ప్రయాణించిన జీవితం అందరికీ ఆదర్శనీయమని పవన్ చెప్పారు.అందుకే రెండోసారి కూడా ఆయనను దేశ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి మీకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Related posts