telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

చుక్కలనంటిన టమాటా ధర.. తెలంగాణలో కిలో రూ.50!

తెలంగాణలో వారం క్రితం  రూ.30 ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు రూ. 50 పలుకుతోంది. కొత్త సాగు వచ్చేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. తెలంగాణలోని మెదక్, వికారాబాద్‌లలో ఎక్కువగా టమాటాను సాగు చేస్తారు. హైదరాబాద్ మార్కెట్లకు ఇక్కడి నుంచే టమాటా సరఫరా అవుతూ ఉంటుంది. రోజుకు దాదాపు 800 క్వింటాళ్ల వరకు ఇక్కడికి వస్తుంది.

నగరంలో టమాటా దినసరి సగటు వినియోగం 6 వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. డిమాండ్ నేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, చిక్‌మంగళూరు నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటారు. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. అప్పట్లో కిలో గరిష్టంగా పది రూపాయలకు విక్రయించారు. అన్‌లాక్ మొదలైన తర్వాత క్రమంగా పెరిగిన టమాటా ధర ఇప్పుడు ఏకంగా రూ. 50కి చేరింది.

Related posts