telugu navyamedia
వార్తలు సామాజిక

జొమాటోలో చైనా పెట్టుబడులు..కంపెనీ టీషర్టులు దగ్ధం చేసిన ఉద్యోగులు!

541 employees out from zomato

ఇటీవల గాల్వాన్ లోయలో ఇండియా, చైనా సరిహద్దుల మధ్య జరిగిన ఘర్షణలు భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలన్న ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జొమాటో ఉద్యోగులు తన కోపాన్ని పనిచేస్తున్న సంస్థపై చూపించారు. జొమాటోలో చైనా పెట్టుబడులు పెట్టి ఇండియాలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తూ ఇండియాలో ఉపాధి అవకాశాలను దగ్గర చేసింది. కోల్ కతాలోని కంపెనీ ఉద్యోగులు జొమాటో అఫీషియల్ టీ షర్టులను దగ్ధం చేశారు. ఈ ఘటన బహాలా ప్రాంతంలో జరిగింది.

చైనా పెట్టుబడులతో నడుస్తున్న సంస్థలో తాము పనిచేయబోమంటూ కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేశారు . 2018లో అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్, జొమాటోలో 210 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి, 14.7 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఆపై మరో 150 మిలియన్ డాలర్లను అదనపు పెట్టుబడిగానూ అందించింది.

Related posts