telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కాలుష్యానికి పరాకాష్ట.. దేవతా విగ్రహాలకు మాస్కులు..

pollution masks to goddess in varanasi

కాలుష్యంపై కొత్త పుంతలు.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వారణాసిలో కూడా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నదని కాశీ క్షేత్రంలో ఓ పూజారి వినూత్న తీరులో దేవతలను అలంకరించారు. నగరంలోని సిగ్రాలో ఉన్న శివ పార్వతుల ఆలయంలో దేవతల విగ్రహాలకు పొల్యూషన్ మాస్క్‌లను తొడిగాడు. వారణాసిలో వాయు నాణ్యత పడిపోవడం వల్ల .. దేవతామూర్తులకు మాస్క్‌లు తొడిగినట్లు పూజారి చెప్పాడు.

వారణాసి అంటే నమ్మకానిని పుట్టినిల్లు అని, దేవతా మూర్తులను ప్రాణమున్న వారిగా భావిస్తామని, ఆ మూర్తులను సంతోషపెట్టేందుకు తాము ఎన్ని కష్టాలైనా పడుతామని, వేసవి కాలంలో దేవతా విగ్రహాలు చల్లగా ఉండేందుకు చందనం పూస్తామని, ఇక చలికాలంలో ఆ విగ్రహాలను ఉన్నీతో కప్పేస్తామని, అందుకే ఇప్పుడు కాలుష్యం నుంచి రక్షణ కల్పించేందుకు, దేవతామూర్తులకు మాస్క్‌లు తొడిగినట్లు పూజారీ హరీశ్ మిశ్రా తెలిపారు. ఆ ఆలయంలో ఉన్న శివుడు, దుర్గాదేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలలకు మాస్క్‌లను తొడిగారు. ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దేవతలే మాస్క్‌లు ధరిస్తే, మరి పూజారులు, ప్రజల సంగతి ఏంటని ట్విట్టర్‌లో కొందరు ప్రశ్నలు లేవనెత్తారు.

Related posts