telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు!

Tirumala

తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేడు సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాలు భక్తులు లేకుండా తొలిసారిగా ఏకాంతంగా జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ, ఏడు కొండల ప్రాంతాన్ని సుందరంగా అలంకరించింది. రంగనాయకుల మండపం, కల్యాణ వేదిక, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించింది.

ఈ రోజు సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారు పెద్ద శేషవాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మాడ వీధుల్లో ఊరేగింపులు ఉండబోవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.

భక్తులు లేకుండా స్వామివారి రథం కదలబోదు కాబట్టి, రథోత్సవాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపింది. ఇక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి ఆహ్వానాన్ని అందించారు.

Related posts