telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అయోధ్య రామాలయానికి రాష్ట్రపతి భారీ విరాళం

Ayodya temple

అయోధ్యలో చేపట్టనున్న రామాలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ మొదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఇవాళ అయోధ్య ట్రస్టుకు 5 లక్షలు విరాళం ప్రకటించారు. విరాళాల సేకరణ ప్రక్రియ నేటి నుంచి దేశం మొత్తం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27 వ తేదీ వరకు ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు తరఫున సహ అధ్యక్షుడు గోవింద్‌ దేవ్‌ గిరిజీ మహారాజ్‌.. ఇవాళ రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌, ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్‌ నిపేంద్ర మిశ్రా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఖుల్‌ భూషన్‌ అహుజా కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ రశీదులు ఇవ్వనున్నారు. రూ.10 చందా కోసం నాలుగు కోటల రశీదులు, రూ. 100 విరాళం కోసం 8 కోట్లు, రూ.1000 విరాళానికి 12 లక్షల రశీదులను ట్రస్ట్‌ ముద్రించింది. నిధుల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్‌ సూచించింది.

Related posts