telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

స్వల్పంగా తగ్గుతున్న పసిడి ధర!

Gold rates hike

గత కొద్ది రోజులుగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మార్కెట్ లో రూ. 56,200 ధర పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రూ. 51,100 వరకూ ధర దిగి వచ్చింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 14 వేలకు పైగా పడిపోయింది. ఓ దశలో రూ. 78 వేలను దాటిన వెండి ధర ఇప్పుడు రూ. 64 వేలకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. కరోనాకు వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తిరిగి స్టాక్ మార్కెట్ వైపు మళ్లించాయి. దీంతో బులియన్ మార్కెట్ డీలా పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ ఉన్నప్పటికీ, రెండో దశ కరెక్షన్ రానుందని, బంగారం ధర మరింతగా తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Related posts