telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లిహిల్స్‌లో మైనర్‌పై అత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల‌కు రిమాండ్‌

*జూబ్లిహిల్స్‌లో మైనర్‌పై అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్టు..
*పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ..
*జూబ్లీహీల్స్ పీఎస్ నుంచి నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులు
*సేక‌రించిన ఆదారాలు ఫోరోనిక్స్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
*నిందితుడికి ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు పూర్తి..
*కాసేప‌ట్లో న్యాయ‌మూర్తి ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్​ బాలిక సామూహిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

అత్యాచార కేసులో ఏ2గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ అనే నిందితుడ్ని ఉస్మానియాలో వైద్య పరీక్షల నిర్వ‌హించారు. అనంత‌రం నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు ప‌రిచారు పోలీసులు.

మాలిక్‌తో పాటు మైనర్లు అయిన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, మరో బాలుడిని పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. మైనర్లకు వైద్య పరీక్షల తర్వాత కోర్టు ముందుకు తీసుకురానున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లైంగిక దాడికి జరిగిన ఇనోవా కారును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం‌లో లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కారు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌కు చెందినదిగా తెలుస్తోంది. 

మరోవైపు.. ఇంకో ఇద్దరు నిదింతులను ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని రేపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Related posts