telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు – హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో జరిగిన మైనర్ అత్యాచార ఘటన‌పై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు.

నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మా కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. 

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటనలో పోలీసులపై ప్రజాప్రతినిధి వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిపై ఎలాంటి వత్తిడి లేదన్న ఆయన…మైనర్ కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు.

ఇక, హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రముఖుల పేర్లు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి.

Related posts