telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాంసం వ్యాపారులను అవమానించారంటూ స్టార్ హీరోపై ఫిర్యాదు

Bigil

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన ‘తెరి’ (పోలీస్‌), ‘మెర్స‌ల్’`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏకకాలంలో విడుద‌ల చేస్తున్నారు. “బిగిల్” తెలుగు హక్కులు నిర్మాత మహేశ్ కొనేరు సొంతం చేసుకున్నారు. కాగా… హీరో విజ‌య్‌పై కొందరు కోవై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. హీరో విజ‌య్ సినిమాలు విడుద‌లకు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో వివాదాలు సాధార‌ణ‌మైయ్యాయి. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తోన్న చిత్రం ‘బిగిల్‌`’ కూడా వివాదాస్పదమైంది. చేప‌ల దుకాణదారులు, మాంసం వ్యాపారులను విజ‌య్ అవ‌మానించాడంటూ ఈ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. మ‌త్స్య‌, మాంస వ్యాపారులు వృత్తిని ప్రారంభించే ముందు దైవంగా భావించి క‌త్తుల‌కు న‌మస్క‌రిస్తారు. అలాంటి క‌త్తుల‌పై విజ‌య్ కాలుపెట్టి కూర్చున్న‌ట్లు పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది మ‌త్స్య‌, మాంస వ్యాపారుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయి. ఈ స‌న్నివేశాల‌ను సినిమా నుండి తొల‌గించాలి లేకుంటే విజయ్ దేశ వ్యాప్తంగా మ‌త్స్య‌, మాంస వ్యాపారుల ఆగ్ర‌హాన్ని చ‌విచూడాల్సి ఉంటుంద‌ని ఫిర్యాదులో తెలిపారు.

Related posts