telugu navyamedia
సినిమా వార్తలు

కంగనా చేతిలో “బాహుబలి”ని మించిన సినిమా

Kangana Ranaut images

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే కంగనా దర్శకత్వంలో ఆమే హీరోయిన్ గా నటించిన “మణికర్ణిక” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. చారిత్రాత్మక నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా నటిగా కంగనాకు సినీ కెరీర్ లో మరోమైలు రాయిగా మారింది. తాజాగా ఈ కాంట్రవర్సీ బ్యూటీ దాంతో మరో చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో కంగనా వుంది. తాను ప్రధాన పాత్రధారిగా నటించే ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించనుంది కంగనా. బడ్జెట్ పరంగా, తారాగణం పరంగా, గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా “బాహుబలి”, “పద్మావత్” సినిమాలకు మించి ఉంటుందని అంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథను లాక్ చేశానని, ప్రస్తుతం తాను చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే తన స్వీయ దర్శకత్వంలోని సినిమాపై దృష్టి పెడతానని కంగనా స్పష్టం చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించడానికి సిద్ధమవుతోంది.

Related posts