ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో తన ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె రెండు లేఖలు రాశారు. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఆమె భర్త రామతీర్థం మరణం తర్వాత మానసికంగా ఒంటరి తనానికి లోనైనట్లు స్థానికుల సమాచారం.రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు.
కావ్యజ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఎస్‌ఆర్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. గతంలో ఆమె లెక్చరర్‌గా పనిచేశారు. తనకు సంబంధించిన వస్తువులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగా ఇవ్వాల్సిందిగా ఆమె ఓ లేఖలో రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్యజీవితంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీకి వచ్చే పరిశ్రమలు తరలిపోతున్నాయి: ఎమ్మెల్సీ మాధవ్