telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ కు మోడీ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందా..?

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీకి వెళ్లి కేసీఆర్.. తొలుత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో‌ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ఇంకా రెండురోజులపాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరింది. అది ఖరారైతే, మోడీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, హర్దీప్‌సింగ్‌ పురి‌, నరేంద్రసింగ్‌ తోమర్‌లతో ఆయన సమావేశమయ్యే అవకాశముంది. ఢిల్లీలో తెరాస కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో.. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts