telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ సినిమాలో మోహన్ లాల్..?

mohanlal

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నాడు. బాహుబలి కోసం నాలుగు సంత్సరాలు పడిన కష్టం ఫలిచింది. ఆ సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాంతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలను చేస్తున్నాడు. సాధారణంగా ఒక్క పాన్ ఇండియా సినిమా చేస్తేనే పెద్ద స్టార్‌గా చెప్పుకుంటారు. కానీ ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వాటిలో ఒకటి రాధేశ్యామ్ పూర్తి కావచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేయనున్నాడు. దాంతో పాటుగా జాతీయ స్థాయి డైరెక్టర్‌గా పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో ‘సలార్’ అనే సినిమాను ఓకే చేశాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ కూడా భారీగా వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ ఈ సినిమాలో నటీనటులను ఎంచుకునే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. అందులోనూ ప్రభాస్‌కు విలన్‌ను వెతకం మరింత తలనోప్పిగి మారింది. అయితే ఇటీవల సలార్ సినిమాలో ప్రముఖ నటులు రానా, మోహన్ లాల్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రానా, ప్రభాస్ కాంబో ఇప్పటికే బాహువలిలో చూసాం. ఆ తరువాత వీరు సాహోలో చేస్తారన్నారు. అది జరగలేదు. మళ్ళీ రాధేశ్యామ్ సినిమాలో కూడా రానా కీలక పాత్ర అంటూ వార్తలు వచ్చాయి. అవి కూడా ఒట్టి పుకార్లను తేలిపోయింది. మళ్లీ ఇప్పుడు తాజాగా సలార్ సినిమాలో మోహన్ లాల్, రానాలు ఇద్దరూ కూడా చేయనున్నారని అంటున్నారు. ఇదెంతవరకు నిజమో తెలియాలి. కానీ ప్రస్తుతం ఈ వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రానా, మోహన్ లాల్, ప్రభాస్ ముగ్గురిని ఒక్క స్క్రీన్‌పై చూస్తామా అనేది గల్లీల నుంచి రాజధాని వరకు హాట్ టాపిక్‌గా మారింది.

Related posts