telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రేపు రానున్న రవితేజ కొత్త పాట…

Krack

చిన్న చిన్న పాత్రల నుంచి ఓరాస్తుతం అగ్ర హీరోగా మారాడు మాస్ మహారాజ్ రవితేజ. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో శ్రుతి హాసన్ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపింమచనున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దీనిని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం ఇటీవల దుబాచ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాయారం ప్రకారం ఈ సినిమా నుంచి ఓ పాట టీజర్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని రవితేజ తన ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ ద్వారా ‘బలేగా తగిలావే బంగారమా’ అనే పాట టీజర్‌ను రేపు విడుదల చేయనున్నాట్లు తెలిపాడు. దీని కోసం అతడి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలను పెంచుకున్నారు. ఇందులో రవితేజా చాలా విలక్షణంగా కనిపిస్తాడని భావిస్తున్నారు.

Related posts