*బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు..
*ఇది చాలా బాధాకరమైన సందర్భం
*కేసీఆర్‌రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు
*కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు
*రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా
*దేశ చరిత్రలో పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారు
దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు(ఆదివారం) సాయంత్రం చండీగఢ్‌కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు, సాగు చట్టాలపై పోరాడి చనిపోయిన రైతుల కుటుంబాలకు పరామర్శించి, చెక్కులు అందించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎకేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు.ఎక్కడా లేని సమస్యలు మన దేశంలోనే ఉన్నాయని, ఇలాంటి సమావేశాలు పెట్టాల్సి రావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశం పరిస్థితి మారలేదని, దేశం ఇలా ఎందుకు ఉందో ఆలోచన చేయాలని కేసీఆర్ తెలిపారు.
సాగు చట్టాలపై పోరాడిన రైతులకు పాదాభి వందనం మని అన్నారు. గాల్వాన్‌లో చైనాతో జరిగిన పోరాటంలో పలువురు సైనికులు మరణించారు. పంజాబ్‌లో ఎన్నికల వలన సైనిక కుటుంబాలను కలవలేకపోయా’ అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు పెడుతోందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. నా ప్రాణం పోయిన మీటర్లు పెట్టనని చెప్పానని తెలిపారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్రవేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను ఎదో విదంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు మాత్రమే ఉందని తెలిపారు.
షర్మిల వ్యాఖ్యల పై స్పందించిన ఎంపీ అరవింద్…