telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దు… మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్

KCR cm telangana

ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ మాట్లాడుతూ వలస కూలీల కోసం శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పాజిటివ్, యాక్టివ్‌ కేసులు లేని జిల్లాల్ని ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా మార్చాలని కేసీఆర్‌ కోరారు. అంతేకాదు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని మోదీకి కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని, రైళ్లలో వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్‌ చేయడం కూడా కష్టమని చెప్పారు. రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేసీఆర్‌ కోరారు. భారతదేశం నుంచే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయని తెలిపారు. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నామని ప్రధానికి కేసీఆర్‌ వివరించారు. పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు ఉన్నాయని తెలిపారు. జులై- ఆగస్ట్‌ నెలల్లోనే కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని మోదీని కేసీఆర్‌ మరోసారి కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా ఇప్పుడే మనల్ని వదిలిపోయేట్టు కనిపించడం లేదని, కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదని వ్యాఖ్యానించారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలని మోదీతో కేసీఆర్‌ చెప్పారు.

Related posts