telugu navyamedia
తెలంగాణ వార్తలు

చండీగఢ్‌ లో చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు ,అమ‌ర వీరుల‌కు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం

*ఛండీగ‌డ్ చేరుకున్న సీఎం కేసీఆర్‌..
* రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు కేసీఆర్ రూ. 3ల‌క్ష‌లు చెప్పున ఆర్థిక స‌హాయం..
*చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో 543మంది రైతుల‌కు కేసీఆర్ ప‌రామ‌ర్శ‌..
* గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా 10 ల‌క్ష‌లుఆర్థికసాయం

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాలతో సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు

ఈ క్ర‌మంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌ వెళ్లిన సీఎం కేసీఆర్ చంఢీగాడ్ చండీగఢ్‌కు చేరుకున్నారు.

తొలుత సీఎం కేజ్రీవాల్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్  సమావేశమయ్యారు. ఇద్దరు సీఎంల మధ్య గంటన్నర పాటు పలు అంశాలపై చర్చలు సాగాయి. కేజ్రీవాల్‌ నివాసంలోనే సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు సీఎంలు వారి బృందాలతో చండీగఢ్​కు బయల్దేరి వెళ్లగా ఇక అక్కడ పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కలిశారు.

ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు.. ముందుగా గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో 600 మంది రైతుల‌కు కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.

 రైతుల‌ కుటుంబాల‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం గాల్వాన్‌ లోయలో అమరులైన వారిలో పంజాబ్‌ నుంచి నలుగురు సైనికులు ఉండగా, వారికి రూ. 10 లక్షల చొప్పన ఆర్థిక సాయం అందించారు.

 

Related posts