telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం : దావోస్ లో ప్రముఖులతో సీఎం జగన్ బిజీబిజీ

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్‌ సదస్సుకు వెళ్లారు.

అందులో భాగంగా సమావేశం తొలిరోజు సీఎం జగన్‌.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్‌ సెంటర్లో భేటీ అయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైన ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతీ 2వేల జనాభాకు వైఎస్సార్‌ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ, తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు.

పలు అంశాలపై చర్చలు జరిపిన జగన్.., డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్‌ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. పంప్‌డ్డ్‌ స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై పలువురితో చర్చింరారు. విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై వీరు ప్రశసంలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని వారు కొనియాడారు.

అనంతరం, డబ్ల‍్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలో డబ్ల‍్యూఈఎఫ్‌లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. సదస్సులో భాగంగానే బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌ బక్నర్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు.

ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌ను మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, సీఎం జగన్‌తో అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. 

అంతకుముందు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయిన ప్రొఫెసర్‌ క్లాజ్‌ అన్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దావోస్ పర్యటనలో బిజీబీజీగా సీఎం జగన్ – CM Jaga busy in davos Tour– News18 Telugu

సోషల్‌ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ వేదికద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని వివరించారు.

Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.

Related posts