telugu navyamedia
తెలంగాణ వార్తలు

దీక్ష భగ్నం : బండి సంజ‌య్‌ అరెస్టు..పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట

*బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బండి సంజయ్‌ దీక్ష భగ్నం చేసిన పోలీసులు
పోలీస్ వాహ‌నాన్ని అడ్డుకున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు
పోలీసులు , కార్య‌క‌ర్త‌లు మ‌ధ్య‌ వాగ్వాదం తోపులాట‌

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు.డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బిజెపి కార్యకర్తలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష తలపెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ క్షను భగ్నం చేసిన పోలీసులు.. కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే బండి సంజయ్ ని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బిజెపి శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు, బిజెపి శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బండి సంజయ్ అరెస్ట్ సమయంలో ప్రజాసంగ్రామ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. భారీగా మొహరించిన పోలీసులు సంజయ్ అరెస్టుకు యత్నించగా బిజెపి కార్యకర్తలు ఆయ‌న చుట్టూ భద్రతా వలయంగా నిలబడ్డారు. అయితే వారిని దాటుకుని సంజయ్ వద్దకు చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.  దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. 

కాగా… ఢిల్లీ మద్యం కుంభకోణంలోటీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపించింది. . ఈ క్ర‌మంలో కవిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు సాయంత్రం కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

ఈ ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. లిక్కర్‌ స్కామ్‌పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం ఆమె ఇందులో పాల్గొన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related posts