telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎన్నికే వివాదాస్పదం: పంచుమర్తి అనురాధ

Panchumarthi-Anuradha

ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు పెయిడ్ ఆర్టిస్టులని రుజువు చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాళ్లు మొక్కుతానని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. శ్రీదేవి ఎన్నికే వివాదాస్పదమని ఆమె ఆరోపించారు. దళితులకు దక్కాల్సిన అవకాశాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో హైజాక్ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని దుయ్యబట్టారు. ఈ విషయం రాష్ట్రపతి వరకు వెళ్లిందని చెప్పారు.

మీ గెలుపు కోసం కృషి చేసిన రాయపూడికి చెందిన హరేంద్రనాథ్ చౌదరి ఈరోజు రైతుల పక్షాన నిలిచారని, ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గ్రామ సచివాలయాలకు మీ పార్టీవారే నల్లరంగు పూశారని వారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని అనురాధ ప్రశ్నించారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాగించే అనైతిక కార్యకలాపాలు ప్రజలందరికీ తెలుసని అన్నారు.

Related posts