telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు: దేవినేని ఫైర్

uma devineni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంటలు నీటమునిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మూర్ఖత్వం, తెలివితక్కువతనం వల్ల ప్రజలు వరద ముంపునకు గురయ్యారని అన్నారు. వరదనీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు వచ్చాయని విమర్శించారు.

వరదనీటిని ముందుగానే దిగువకు ఎందుకు మళ్లించ లేదని ప్రశ్నించారు. అలా చేసి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగానికి నష్టం జరిగేది కాదని అన్నారు. వరద ముంపు బాధితులకు సహాయక చర్యలు అందడం లేదని విరుచుకుపడ్డారు. లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారని చెప్పారు. వరదల కారణంగా వారి పొలాలు నీటమునగగా, పశువులు కొట్టుకుపోయాయని, కనీసం, తమ ప్రాణాలు అయినా కాపాడాలని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Related posts