telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎంపీ చర్యలు విస్మయానికి గురి చేసింది : చంద్రబాబు

chandrababu

రక్త నమూనాలను పరీక్షించే ల్యాబ్‌లో అడ్డంకులు కల్గిస్తూ ఓ వైసీపీ ఎంపీ చర్యల గురించి తెలుసుకుని షాక్ అయినట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఈ ల్యాబ్‌కు ఐసీఎంఆర్‌ కూడా అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్‌పై పోరాడుతూ వైద్య సిబ్బంది తమ జీవితాలను పణంగా పనిచేస్తోన్న సమయంలో ఆ ఎంపీ ఇటువంటి చర్యలకు పాల్పడడం విస్మయానికి గురి చేస్తోందని చంద్రబాబు తెలిపారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరికి చెందిన భవనంలోని ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేయడానికి అనుమతులురాగా, ఆ తదుపరి రోజే ఈ పనులను అడ్డుకున్నారని జాతీయ చానెల్ టైమ్స్‌ నౌ తెలిపింది. ఈ వీడియోను చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కరోనా పోరాటంలో ఆటంకాలు కలిగిస్తున్నారని జాతీయ చానెల్‌లో విమర్శలు చేశారు. కొవిడ్‌ వారియర్స్ ల్యాబ్‌ను ఆయన టార్గెట్ చేశారని పేర్కొన్నారు.

Related posts