telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఏపీ-తెలంగాణ మధ్య పోరు : ఏపీ డీజీపీ ఠాకూర్ ఇంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన జీహెచ్ఎంసీ ..!

ap-telangana war collapsed ap dgp house

అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విడగొట్టి వారు కొట్టుకుంటుంటే చూసి ఎవరు ఆనందపడుతున్నారో తెలియదు కానీ, ఆ రెండు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల రేగిన డేటా వార్ ఒక ఎత్తయితే, ఇక తాజాగా, అక్రమ నిర్మాణాలంటూ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంట్లోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ప్లాటు నెంబర్ 149లో డీజీపీ ఇల్లు ఉంది.

దీనికి ఆనుకుని ఉన్న హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని డీజీపీ ఆక్రమించి ప్రహరీ నిర్మించారనేది జీహెచ్ఎంసీ అధికారుల ఆరోపణ. ఇంకా తన ఇంటికి జీ ప్లస్ 1కు మాత్రమే అనుమతి ఉండగా డీజీపీ మూడు అంతస్తులు నిర్మించారనేది మరో అరోపణ. అయితే, ఆ తర్వాత డీజీపీ వాటిని క్రమబద్ధీకరించుకున్నారు. ఠాకూర్ తన ఇంటి కోసం మెట్లు నిర్మించే సమయంలో పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోని కొంత స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. ఈ విషయమై జీహెచ్ఎంసీకి హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు దీనిని కూల్చివేశారు.

జీహెచ్‌ఎంసీ పార్కు స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణాల కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను హైకోర్టు ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు రెండు వారాల గడువు కావాలన్న డీజీపీ తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఈనెల 11కే దాఖలు చేయాలని తేల్చి చెప్పింది.

Related posts