telugu navyamedia
రాజకీయ

ఈవీఎంల రిగ్గింగ్‌ ఆరోపణలపై బీజేపీ ఫైర్

OU students wrote letter to EC
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగిందని లండన్‌లో సైబర్‌ భద్రతా నిపుణుడు ఆరోపించడంపై బీజేపీ మండిపడింది.ఈ ఆరోపణలు కాంగ్రెస్‌  కుట్రలో భాగమని ఆరోపించింది. ఈ వ్యవహారం పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్  మీడియాతోమాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసినందునే కాంగ్రెస్ సాకులు వెతుకుతున్నదని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘానికి తలవంపులు తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో చూపుతామని చివరికి ముసుగు ధరించిన ఓ వ్యక్తి అమెరికా నుంచి మీడియాతో మాట్లాడటం రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. సయ్యద్ సుజా ఆరోపణలకు ఆధారాలు చూపక పోగా మీడియా ప్రశ్నలకు అందుబాటులో లేకుండా పోయారన్నారు. ఈవీఎంల రిగ్గింగ్ గురించి తెలిసినందునే కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే హత్యకు గురయ్యారన్న ఆరోపణలు తమను తీవ్ర వేదనకు గురిచేశాయన్నారు. లండన్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌ ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు.

Related posts