telugu navyamedia
సినిమా వార్తలు

“మా ” అధ్యక్షులకు రాజకీయ పార్టీల మద్దతు!

ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చిరంజీవితో పాటు జనసేన పార్టీ మద్దతు కూడా వుంది. “రిపబ్లిక్ ” సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకాష్ రాజ్ గురించి ప్రస్తావిస్తూ .. లోకల్ , నాన్ లోకల్ అనేది పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ప్రకాష్ రాజ్ పై వస్తున్న విమర్శలకు పవన్ ఆవిధంగా సమాధానం చెప్పాడు. పవన్ కు వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ నామినేష్ ఉపసంహరించుకొని తన మద్దతు ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు.

మంచు విష్ణు కు వై ,ఎస్ .ఆర్ పార్టీ నాయకుడు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్దతు కూడా ఉందని, అందుకే సాక్షి దిన పత్రిక , ఛానల్ లో విష్ణుకు అనుకూలంగా వార్తలు , అభిప్రాయలు వస్తున్నాయని తెలుస్తుంది. అంతే కాదు కొంత మంది సినిమా ప్రముఖులకు విష్ణు గెలుపు కోసం కృషి చెయ్యమని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విష్ణు గెలిస్తే “మా ” తమ కనుసన్నల్లో ఉంటుందని వై .సి .పి నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అందుకే రెండు ప్యానల్ నాయకులు హోరాహోరీగా పోరాడటానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఈ నెల 10న ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగళూరు , మద్రాసు , ముంబయి నుంచి వచ్చే నటీనటుల కోసం విమానం టిక్కెట్లు బుక్ చెయ్యడం , వారు బస చెయ్యడానికి ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా బుక్ చేస్తున్నారని తెలుస్తుంది. “మా ” అధ్యక్ష పదవి ఎవరిని కరుణిస్తుందో ?

Related posts