telugu navyamedia
Uncategorized సినిమా వార్తలు

మ‌హేష్‌ బెల్ట్ బిగించారు..!

సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు మ‌రో శుభవార్త. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’ చిత్రయూనిట్ ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఆగస్టు 9’ పేరుతో జిప్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ తాజా మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రం. అయితే ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం.

తాజాగా విడుదల చేసిన దానిలో మహేష్ తన నడుముకున్న బెల్ట్ ని గట్టిగా బిగించారు. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ ద‌ ర్శకత్వంలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదలచేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు చిత్ర యూనిట్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సర్కారు వారి నోటీసులతో అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

మ‌రోవైపు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొద‌లు పెట్టారు. కామన్ డీపీలు, హ్యాష్ ట్యాగ్స్, బ్యానర్లు, ప్లెక్సీలు, అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.. అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఆగస్టు 9న సర్ ప్రైజ్ రానుంది.

Related posts