సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ‘సైరా’ మూవీ యూఎస్ఎలో కూడా భారీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిజినెస్ జరిగిపోయినట్లు సమాచారం. భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది.. అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 1న మంగళవారం కావడం.. అమెరికాలో సైరా సినిమాకు కాస్త అడ్వాంటేజ్‌గా మారనుంది. అమెరికాలో ప్రతి మంగళవారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, యాప్స్ పలు ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంటాయి. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేలా మన టాలీవుడ్ నిర్మాతలు.. సినిమాలను విడుదల చేస్తుంటారు. మంగళవారం అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లను గమనిస్తే… ఖైదీ నెంబర్ 150, అజ్ఞాతవాసి, స్పైడర్, గీత గోవిందం.. వంటి సినిమాలన్నీ మంగళవారం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా విడుదలయ్యాయి. వీటిలో పవన్, మహేశ్ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్ కలెక్షన్లలో దుమ్మురేపాయి. అజ్ఞాతవాసి సినిమా అయితే ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. స్పైడర్ కూడా మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాకు 2.45 మిలియన్ డాలర్ల కలెక్షన్లను చేరుకోగా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. అందుకే పెద్ద సినిమాలను సరిగ్గా మంగళవారం విడుదలయ్యేట్లు నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా అమెరికాలో మంగళవారమే విడుదలవబోతోంది. అమెరికాలో ప్రస్తుతం ఏటీ&టీ సంస్థ ఒక టికెట్ కొంటే.. మరో టికెట్ ఫ్రీ అనే ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సంస్థ నుంచే కాకుండా.. పలు సోషల్ మీడియా యాప్స్ కూడా ఇలాంటి ఆఫర్లను అందుబాటులో ఉంచాయి. మరి ఈ ఆఫర్లతో సైరా చిత్రం కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో వేచి చూడాలి.
శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత