telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్జీవీ ట్వీట్ కు .. మ‌నోజ్ రివ‌ర్స్ ఎటాక్‌..

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి అంశం పై తనదైన శైలి లో స్పందిస్తూ ఉంటారు. ప్ర‌తి విష‌యంలో ద‌గుదున‌మ్మా అంటూ ముందు వ‌రుస‌లో ఉంటాడు..

సినిమా మా ఎన్నిక‌లు జ‌రిగి ప‌ది రోజులు కావోస్తున్నా.. టాలీవుడ్ లో రచ్చ మామూలుగా లేదు.. .విమ‌ర్శలు..ప్ర‌తివిమ‌ర్శ‌లు మ‌ధ్య మంచు విష్ణు మా అధ్య‌క్ష ప‌ద‌విని చేజిక్కుచ్చుకున్నాడు..అయితే ఎన్నిక‌ల పోలింగ్ స‌మయంలో మాకు అన్యాయం జరిగిందంటూ ప్రకాశ్‌రాజ్ ప్యాన‌ల్‌ ‘మా’ఎన్నికల పోలింగ్‌ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులను ఆశ్ర‌యించారు.

Prakash Raj takes on Vishnu Manchu in direct fight for MAA president

అయితే తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపణలు అన్ని అర్థరహితమని ‘మా’అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు అంటున్నాడు.. ఈ మేరకు ఈ సిని పరిశ్రమ లో అంశాల పై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Where is Manchu Manoj heading?

సినీ మా ఒక సర్కస్ అని, అందులో అందరూ జోకర్స్ ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పై మంచు మనోజ్ స్పందించారు. మీరు రింగ్ మాస్టర్ అంటూ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ కి ఇలా రెస్పాన్స్ అవుతూ మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీని పై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts