telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్ లో బిక్కుబిక్కుమంటున్న తెలుగువారు ..

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. దీంతో  అక్క‌డ‌ అత్యవసర పరిస్థితి అనౌన్స్ చేశారు. అయితే  తెలుగు రాష్ట్రాల్లో చెందిన చాలా మంది చదువు, ఉద్యోగాల కోసం వెళ్లి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి ఉక్రెయిన్‌లో నెలకొంది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంతో అక్కడ ఉంటున్న వేలాది మంది తెలుగు వాళ్ల పరిస్థితి అయోమయంగా మారింది.

గత కొద్దిరోజులుగా ధైర్యంగా ఉంటూ వచ్చినప్పటికి తాజాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు చిక్కుకుపోయారు.

రష్యా యుద్ధం ప్రారంభించడంతో… దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో… భీకర బాంబుల శబ్ధాల మధ్య.. గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ.. స్వస్థలాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు.. కావాల్సిన నిత్యావసరాలను ముందే తీసుకొచ్చుకుని.. అందుబాటులో పెట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా తమను స్వస్థలాకు తీసుకురావాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేశారు.

Students from Ukraine joke to keep their anxiety at bay as they land in India

దీంతో త‌ల్లిదండ్రులు వీలైనంత త్వరగా…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లల్ని రప్పించాలని కోరుతున్నారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని.. మా పిల్లలను ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

అయితే.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లకు ఆంధ్రా, తెలంగాణ ప్రజాప్రతినిధులు ధైర్యం చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉన్న వారిని క్షేమంగా తీసుకొచ్చే పనిలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వం చూస్తోందని , త‌ల్లి దండ్రులు ఎవ‌రూ అధైర్యపడవద్దని సూచించారు.

Related posts