telugu navyamedia
Uncategorized

భీమ్లా నాయక్ పై రాఘవేంద్ర రావు ట్వీట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా దియేటర్లలో విడుదలైంది.

ప‌వ‌న్ అభిమానులు అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల ఉత్సాహం ఉరకలెత్తుతోంది. భీమ్లా నాయక్ చిత్రానికి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ మొదలైపోయింది.

దీంతో భీమ్లా నాయక్ చిత్రానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీలు వరుసగా భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భీమ్లా నాయక్ చిత్రానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పవర్ తూఫాన్ రేపటి నుంచి థియేటర్లలో… భీమ్లా నాయక్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టీం అందరికి కృతజ్ఞతలు…’ అని రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

Related posts