telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి రిజర్వేషన్ పై ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన ఈసీ

undvalli sridevi ycp mla

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఆమెది ఎస్సీ సామాజికి వర్గమేనా, లేదా అనే విషయంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని శ్రీదేవి చెప్పుకున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు.

క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం… ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, శ్రీదేవి రిజర్వేషన్ పై విచారణ జరపాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల నేపథ్యంలో, ఈనెల 26న మధ్నాహ్నం 3 గంటలకు తమ ముందుకు విచారణకు రావాలని శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కోరారు. ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను తీసుకురావాలని సూచించారు.

Related posts