telugu navyamedia
రాజకీయ వార్తలు

మళ్ళీ మూతపడుతున్న ఆలయాలు…

Srishailam temple

కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఆంక్షలు విధించారు.  మాస్క్ తప్పనిసరి చేశారు.  కరోనా లక్షణాలు ఉంటె తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, తెలుగు రాష్ట్రాలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది.  కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.  ఇప్పటికే తెలంగాణలోని వేములవాడ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేదించారు.  ఇక ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలోని యాగంటి, కడప జిల్లాలోని ఒంటిమిట్టతో పాటుగా అనేక దేవాలయాలను మూసివేశారు.  అయితే, నిత్యకైంకర్యాలను యధావిధిగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెప్తున్నారు. శ్రీరామనవమి వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు మహారాష్ట్రలో ఇప్పటికే షిరిడి సాయిబాబా ఆలయం, ముంబైలోని గణపతి ఆలయాన్ని మూసేశారు.

Related posts