telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : చివర్లో ముంబై మెరుపులు… పంజాబ్ లక్ష్యం..?

ఈ రోజు ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై కాప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక మొదట బేటింగ్ కు వచ్చిన ముంబై కి పంజాబ్ బౌలర్లు షాక్ ఇచ్చారు. పవర్ ప్లే లోనే మూడు వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టారు. కానీ అప్పటికి ఔట్ కాకుండా ఉన్న క్వింటన్ డికాక్ (53) అర్ధశతకంతో రాణించగా.. క్రునాల్ పాండ్యా (34) అతనికి తోడుగా నిలిచాడు. వీరు ఇరువురు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పొలార్డ్ 12 బంతుల్లో 34 అలాగే నాథన్ కౌల్టర్-నైల్ 12 బంతుల్లో 24 పరుగులాఠి చివర్లో మెరుపులు మెరిపించారు. దాంతి ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ రెండేసి వికెట్లు సాధించగా రవి బిష్ణోయ్, క్రిస్ జోర్డాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించాలంటే 177 పరుగులు చేయాలి. ఇక గత మ్యాచ్ మాదిరిగా పంజాబ్ టాప్ ఆర్డర్ రాణిస్తే వారికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts