telugu navyamedia
వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి వివాహం ..పెళ్లి జంటతో పాటు అతిథుల అరెస్ట్

ప్రపంచ దేశాలన్ని కరోనను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు సామాజిక దూరం పాటించేలా లాక్‌ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది నిబంధనలను తుంగలోతొక్కి ఈయష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు పెళ్లి జంటతో పాటు వివాహానికి హాజరైన అతిథులు అరెస్టయ్యారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే 48 ఏళ్ల జబులాని జులు అనే వ్యక్తి నొమ్తాండాజొ మెక్ జీ (38)ని ఆదివారం విహాహం చేసుకున్నాడు. క్వాజులు- నటాల్ అనే ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై అక్కడ నిషేధం ఉంది. అయినా.. జులు, మెక్‌ జీ పెళ్లి వేడుక జరుగుతున్న విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వేడుకను నిలిపివేసి వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా కుటుంబ సభ్యులు, అతిథులను అరెస్ట్ చేశారు.

Related posts