telugu navyamedia
సినిమా వార్తలు

జనసేన పార్టీలో శ్రీరెడ్డి… !!?

Srireddy-and-Pawan-Kalyan

తాజాగా జనసేన పార్టీ నుంచి వచ్చిన ఓ అధికారిక ప్రకటన అందరినీ విస్మయపరిచింది. శ్రీరెడ్డి జనసేన పార్టీలో చేరిందంటూ స్వయంగా జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావడమే దీనికి కారణం. జనసేన పార్టీపైన, జనసైనికుల పైన, జనసేన అధ్యక్షుడు పైనా ఎప్పుడూ మండిపడే శ్రీరెడ్డిని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి… ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగబాబులపై విమర్శలు గుప్పించే శ్రీరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకోవడం ఏంటనే విషయం ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాకుండా శ్రీరెడ్డి కూడా తన సోషల్ మీడియా పేజ్ లో “సర్ప్రైజ్ ఎలా ఉంది?” అంటూ పోస్ట్ చేయడంతో శ్రీరెడ్డి నిజంగానే జనసేన పార్టీలో చేరిందేమో అనుకున్నారంతా. దీంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది.

అయితే అసలు నిజమేమిటంటే… జనసేన పార్టీలో చేరేది ఎస్.పీ.వై. రెడ్డి… ఆయన పేరు పొరపాటున శ్రీరెడ్డిగా పడింది. అయితే ఈ పొరపాటును చేసుకోకుండానే జనసేన అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అయితే ఈ పొరపాటును గ్రహించి, సరి చేసుకుని శ్రీ ఎస్.పీ.వై. రెడ్డి పేరుతో కొత్త పోస్ట్ రీప్లేస్ చేసేశారు. కానీ అంతలోపే ఆ పోస్ట్ వైరల్ గా మారింది. విషయం శ్రీరెడ్డి దాకా వెళ్లడంతో తన పేరుతో వచ్చిన పోస్ట్ స్క్రీన్ షాట్ ను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తనదైన స్టయిల్లో స్పందించింది శ్రీరెడ్డి.

Related posts