telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టాలీవుడ్‌లో మరో వికెట్ పడింది…” నిఖిల్ పెళ్ళిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్

Saitej

తాజాగా హీరో నిఖిల్ పెళ్లితో ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే. నిఖిల్ పెళ్ళిపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను ఈ రోజు (మే 14వ తేదీ) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు వేద మంత్రాల నడుమ పెళ్లాడారు. లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రేమ వివాహం అతికొద్ది మంది సమక్షంలోనే జరిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ జోడీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ”టాలీవుడ్‌లో మరో వికెట్ పడింది. జీవితంలో అతి పెద్ద అడుగు వేసిన నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నా. భవిష్యత్తులో మీ జీవిత ప్రయాణమంతా హ్యాపీ‌డేస్ తోనే గడిచిపోవాలని కోరుకుంటున్నా” అన్నారు. మెగా మేనల్లుడు పెట్టిన ఈ కామెంట్ చూసి ‘వావ్! వెరీ ఇంట్రెస్టింగ్.. మరి మీ వికెట్ ఎప్పుడో!’ అంటూ నిఖిల్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related posts