telugu navyamedia
క్రీడలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డ క్రికెటర్

Madhushanka

శ్రీలంక క్రికెటర్‌ శేషన్‌ మధుశంక.. డ్రగ్స్ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి 2 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దాంతో మధుశంకపై డ్రగ్స్‌ ఆరోపణలు రావడంతో తక్షణ నిర్ణయంగా ఆయనను అన్నిరకాల ఫార్మాట్ల నుంచి సస్పెండ్‌ చేసినట్లు శ్రీలంక క్రికెట్‌ కార్యదర్శి మోహన్‌ డీ సిల్వా చెప్పారు. ఓ స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న 25 ఏండ్ల శేషన్‌ మధుశంక.. డ్రగ్స్‌ కలిగివున్న ఆరోపణలతో అరెస్ట్‌ కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక క్రికెట్‌ అధికారులు చెప్పారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంగేట్రం చేసిన మధుశంక.. అదే సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో హ్యాట్రిక్‌ సాధించాడు. ఇదే ఏడాది టీ20 మ్యాచులు కూడా ఆడాడు. అయితే, గాయాలపాలు కావడంతో అంతర్జాతీయ మ్యాచులకు దూరం కావాల్సి వచ్చింది.

Related posts