telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రావణి, ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్

Shravani

ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజ్ అనే వ్యక్తే అని, దేవరాజ్ కు శ్రావణి సీరియల్ అవకాశాలు ఇప్పించిందని, అయినప్పటికీ శ్రావణిని అతడు వేధించేవాడని, వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే తాజాగా ఆర్‌ఎక్స్‌100 నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణ లీకయ్యింది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలోకూడా శ్రావణి దేవరాజ్ పై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ల ఫిర్యాదు చేసింది. దేవరాజ్ టిక్ టాక్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారి దగ్గర డబ్బులు గుంజుతాడని పేర్కొంది. అంతే కాకుండా అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తాడని పేర్కొంది. శ్రావణిని కూడా దేవరాజ్ ప్రేమ పేరుతో మోసం చేసి ముఖం చాటేసాడని అందువ్లలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Related posts