telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది: పవన్ కల్యాణ్

pawan

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే. గౌ. ముఖ్యమంత్రి ‘శ్రీ జగన్ రెడ్డి’ గారి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది” అని పవన్ ట్వీట్ చేశారు. తిరుమలలో మాయమైందన్నట్టుగా అనుమానిస్తున్న పింక్ డైమండ్ పైనా సీబీఐ దృష్టి సారించాలన్నారు.

“అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబిఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి”అని డిమాండ్ చేశారు.

“ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి” అని ఆయన ట్విటర్ లో కోరారు.

Related posts