ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంపై టిడిపి నేత నారా లోకేష్ .. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని.. ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని ఫైర్ అయ్యారు. “నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలుచేయాల్సిన పోలీసులు జగన్ పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షం, ప్రజలకి ఇంకెక్కడి రక్షణ? ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి. ఏపీలో అరాచకపాలనపై ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, రాష్ట్ర గవర్నర్ సత్వరమే స్పందించాలి. కేంద్ర బృందాలతో న్యాయ విచారణ జరిపించాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
previous post
సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు: చంద్రబాబు