telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కు వచ్చిన రష్యా వ్యాక్సిన్…

corona vaccine

కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురుచూస్తున ఒక్కేఒక విషయం కరోనా వ్యాక్సిన్. అలాంటి సమయంలో కరోనా వైరస్ కు మొదటి టీకాను రష్యా తయారు చేసింది.  స్పుత్నిక్ వి పేరుతో ఈ టీకాను మార్కెట్లోకి ఇప్పటికే రిలీజ్ చేసింది.  అయితే, ఈ టీకాకు సంబంధించిన ఎలాంటి డేటాను ఆ దేశం బయటకు ఇవ్వకపోవడంతో టీకాపై ప్రపంచదేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు.  దీంతో మూడోదశ ట్రయల్స్ ను రష్యా నిర్వహించింది.  92శాతానికి పైగా టీకా విజయం సాధించినట్టు ఇప్పటికే ఆ దేశం ప్రకటించింది.  ఇక ఇదిలా ఉంటె, ఈ టీకా ఇప్పుడు భారత్ కు చేరింది.  భారత్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో రష్యా ఇప్పటికే ఈ టీకా తయారీపై ఒప్పందం కుదుర్చుకుంది.  రెడ్డీస్ ల్యాబ్స్ కు ట్రయల్స్ కు సంబంధించిన డోస్ లు చేరినట్టుగా రష్యా వెల్లడించింది.  ఈనెల 15 వ తేదీ తరువాత 2,3 వ దశలకు సంబంధించిన ట్రయల్స్ ను ప్రారంభించబోతున్నారు.  ట్రయల్స్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తుంది. మరి ఇది పూర్తిగా విజయంవంతం అయ్యి బయటకి ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి మరి.

Related posts